<?xml version="1.0" encoding="UTF-8"?><song><lyrics>[C1]
   భీకరుండౌ మా యెహోవా - పీఠ మెదుటన్ గూడరే
   ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే // భీకరుండౌ //

[V1]
 మట్టితోనే మమ్ము నెల్ల - మానవులుగ సృజించెను
 ఇట్టి శక్తుండౌ ప్రభున్ మే-మెచ్చుగా మది నెంతుము // భీకరుండౌ //

[V2]
 ఏరితోడు లేక మము స-ర్వేశ్వరుడు సృష్టించెను
 ధారుణిన్ దానొక్కడే మా - దైవమని పూజింతుము // భీకరుండౌ //

[V3]
 పుట్టగిట్టన్ జేయ దానై - నట్టి దేవుని శక్తిని
 బట్టుగా లోకస్తులారా - ప్రస్తుతింపరే భక్తిని // భీకరుండౌ //

[V4]
 మేటి సంగీతంబులపై - మింట నారవ మొందను
 జాటరే వేవేల నోళ్ళన్ - సన్నుతుల్ ప్రభు వందను // భీకరుండౌ //

[V5]
 మిక్కిలి కష్టంబులతో - మిత్తికిని బాల్పొందను
 దిక్కు లేని గొర్రెలట్లు - దిరుగ జేర్పన్ మందను // భీకరుండౌ //</lyrics>
<title>భీకరుండౌ మా యెహోవా</title>
<hymn_number>229</hymn_number>
</song>